బీజేపీ ఎమ్మెల్యే నితీశ్‌ రాణేకు పోలీస్‌ నోటీస్‌

56చూసినవారు
బీజేపీ ఎమ్మెల్యే నితీశ్‌ రాణేకు పోలీస్‌ నోటీస్‌
సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే నితీశ్‌ రాణేకు ముంబై పోలీసులు నోటీసులిచ్చారు. జులై 12న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే నితీశ్‌ రాణే స్పందిస్తూ.. దిశా మిస్టరీ మరణానికి సంబంధించిన ఆధారాలు అందజేస్తానని తెలిపారు. ‘ఇది హత్య కేసు అని తొలి రోజు నుంచి చెబుతున్నా. ముంబై పోలీసులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని అన్నారు.

ట్యాగ్స్ :