వరంగల్‌లో BRS పార్టీ నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతినిచ్చారు. ఈ మేరకు BRS నేతలు పోలీసుల నుంచి అనుమతి పత్రాలు అందుకున్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో 27న పార్టీ రజతోత్సవ సభకు భారీగా ఏర్పాటు చేస్తోంది. రజతోత్సవ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న BRS.. జిల్లాల నుంచి లక్షల మందిని తరలించేందుకు మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి జిల్లా శ్రేణులతో సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.