TG: రాష్ట్ర యువత అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్‌కి షాక్ తగిలింది. కంచ గచ్చిబౌలి భూమలు విషయంలో ఏఐ రూపొందించిన చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పోలీస్ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి ఎస్‌ఐ మాట్లాడుతూ.. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 179 ప్రకారం స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నోటీసులలో తెలిపిన విషయాలను ప్రస్తుతం గోప్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు.