AP: వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఒక కేసు విషయంలో గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా, వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు, నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.