ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువతకు రాజకీయ శిక్షణ తరగుతులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘లీడర్ బిల్డ్ తెలంగాణ’ అనే పోస్టర్ విడుదల చేశారు. ‘ జాగృతి యువతను ప్రోత్సహిస్తుంది. యూత్ రాజకీయాల్లోకి వస్తేనే క్లీన్ పాలిటిక్స్ అవుతాయి. పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేనివాళ్లు రాజకీయాల్లోకి వచ్చేందుకు జాగృతి ప్లాట్‌ఫామ్ కానుంది’ అని కవిత తెలిపారు.