TG: కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తొలిసారి స్పందించారు. తాను మంత్రిగా లేకపోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని అన్నారు. తనకు రాజకీయాలంటే పదవులు లేదా అధికారాలు కదన్నారు. 'నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు, పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నాను' అని అన్నారు.