ది హండ్రెడ్ మెన్స్ 2024లో సదరన్ బ్రేవ్ ఆటగాడు కీరాన్ పోలార్డ్ విధ్వంసం సృష్టించాడు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా 5 సిక్సర్లు బాదాడు. దీంతో సదరన్ బ్రేవ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సదరన్ బ్రేవ్ ఓ దశలో ఓటమి దిశగా వెళుతుండగా, పోలార్డ్ 5 సిక్సర్లు బాది విజయానికి చేరువ చేశాడు.