భద్రాద్రి జిల్లా కేంద్రంలో పాల్వంచ, లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి మంజూరీ పత్రాలు అందజేశారు. SRT, మాయాబజార్ భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాల పట్టాలు అందజేసినట్లు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి(M) సీతారాంపురం, చింతపెంటిగూడెంలో హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. మంత్రి వెంట ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కూనంనేని సాంబశివరావు ఉన్నారు.