ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. పోర్న్ రాకెట్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. కుంద్రాతో పాటు ఆ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల ప్రాంగణాలపైనా దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టింది. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు ఆప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారని 2021లో కుంద్రాపై కేసు నమోదైంది.