AP: సినీనటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మార్చి 13 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. దీంతో ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. నిన్న 9 గంటల పాటు విచారించిన పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపర్చారు. పోసాని తరఫున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ బెయిల్ ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు.