డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1921 నుంచి 1932 వరకు కలకత్తా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1931-36 మధ్య ఆంధ్రా యూనివర్సిటీకి, 1939-48 మధ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు.1936-52 వరకు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఈస్టర్న్ రిలీజియన్ అండ్ ఎథిక్స్ స్పాల్డిండ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.1948లో యునెస్కో కార్యనిర్వాహక బోర్డు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.