TG: భూమి రికార్డులను మార్చి ప్రభుత్వ, భూదాన్, ఎసైన్డ్, దేవాదాయ, వర్ఫ్ భూములకు ఎవరైనా పట్టాలు పొందితే.. వాటిని రద్దు చేయాలంటూ ఎవరైనా దరఖాస్తు చేయవచ్చని భూ భారతి చట్టంలోని 16వ సెక్షన్, 15వ నిబంధన స్పష్టం చేస్తోంది. ఇంతకాలం అమలులో ఉన్న ధరణిలో ఇలాంటి నిబంధన లేదు. ఇళ్ల స్థలాలకు, ఆబాదీ, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు నిర్వహిస్తారు. భూధార్ కార్డులు జారీ చేస్తారు.