నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ (53) యూకేలో పోలో ఆడుతూ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అంతకుముందే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై స్పందించారు. మృతులకు సంతాపం తెలుపుతూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కొన్ని గంటలకే ఆయనకు గుండెపోటు రావడం విషాదంగా మారింది. బాలీవుడ్ ప్రముఖులు ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.