వేసవిలో చాలా మంది చల్లటి నీరు తాగడానికి ఇష్ట పడుతారు. అలాంటి వారికి కుండలోని నీరే ఉత్తమం. కుండలోని నీటిని చల్లగా మార్చే ట్రిక్కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ మహిళ కుండలో నీటిని నింపి ఉప్పు వేసింది. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఆ నీటిని పారబోసి బాగా కడిగింది. అనంతరం కుండను మంచి నీటితో నింపి దానిని తడి ఇసుకపై ఉంచింది. తర్వాత అందులో పటిక వేసి కాసేపు తిప్పింది. ఇలా చేస్తే నీరు బాగా కూలింగ్ ఆవుతుందని చెప్పింది.