పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పాస్లర్ల మధ్య ఆధిపత్య పోరు తలెత్తింది. స్థానిక చర్చిలోనే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఆదివారం ప్రార్థన చేసేందుకు చంద్రశేఖర్, నవకుమార్ అనే ఇద్దరు పాస్టర్లు పోటీ పడ్డారు. వారికి మద్దతుగా చర్చికి వచ్చిన వాళ్లంతా రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రంగా వాగ్వివాదానికి పాల్పడ్డారు. పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. కాగా గతంలో కూడా పలుమార్లు ఇదే విధంగా జరిగిందని పోలీసులు తెలిపారు.