ప్రభాస్ పీఏ అంటూ ఫేక్ కాల్ చేశారు: ఫిష్ వెంకట్ కూతురు (వీడియో)

58చూసినవారు
ఫిష్ వెంకట్‌ ఆపరేషన్‌కు అండగా ఉంటామంటూ ప్రభాస్ పీఏ నుంచి కాల్ వచ్చిందని ఇటీవల ఆయన కూతురు తెలిపిన విషయం విదితమే. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. ప్రభాస్ పీఏ అంటూ ఫేక్ కాల్ చేశారని.. ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు వచ్చిన నంబర్‌కు మళ్లీ కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ కాల్స్‌తో ఇబ్బంది పెట్టకుండా నిజంగా సాయం చేసేవారు ఉంటే చేయండని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్