పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం "ది రాజా సాబ్". ఈ చిత్రం టీజర్ విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు "ఎంతో వినోదభరితంగా టీజర్‌ను కట్ చేశాం. జూన్ 16న ఉదయం 10.52 గంటలకు విడుదల చేస్తాం" అని మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు. టీజర్ విడుదల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.