బిహార్‌లో బీపీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జన్ సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ గురువారం దీక్ష విరమించారు. నిరసన చేస్తున్న బీపీఎస్సీ అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ఖండిస్తూ ఆయన జనవరి 2 నుంచి ఈ దీక్ష చేస్తున్నారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన అధికారులపై రెండు రోజుల్లో హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. విద్యార్థులకు అనుకూలంగా తీర్పు రాకపోతే.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.