తెలంగాణలో ప్రతి జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్‌వాడీ కేంద్రాలున్న ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలను అందుకు ఎంపిక చేయనుంది. ప్రీ ప్రైమరీ స్కూలు విద్యార్థుల కోసం విద్యా వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ భావిస్తోంది. డీఈడీ చదివి, టెట్ పాసై ఉన్నవారిని నియమించనున్నట్లు తెలుస్తోంది. వాళ్లకు టీచర్‌కు ట్యాబ్‌లు కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.