వేరే దేశాలకు మిరపను ఎగుమతి చేయాలనుకునే రైతులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సస్యరక్షణ మందుల అవశేషాల పరిమితిలను పాటించాలి. మిరపకు ఆయా దేశాలు నిర్ధేశించిన పరిశుభ్రత ప్రమాణాలు లేకపోయిన, మోతాదుకి మించి సస్యరక్షణ మందుల అవశేషాలు ఉన్న దిగుమతి చేసుకోవచ్చు. ఈ విషయంలో తప్పకుండా వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. తద్వారా మంచి ధర పొందడానికి అవకాశం ఉంటుంది.