పంట నుంచి కోసిన కాయలను కుప్పగా పోసి టార్పాలిన్‌తో ఒక రోజంతా కప్పి ఉంచాలి. ఇలా చేస్తే కాయలు అన్నీ ఒకేలా పండుతాయి. తర్వాత కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రం చేసిన కాంక్రీటు కల్లాల మీద అరబెట్టాలి. తాలు కాలయను, మచ్చ కాయలను గ్రేడింగ్ చేసి వేరు చేయాలి. రాత్రిపూట మంచు పడకుండా కాయలను పట్టాలతో కప్పి ఉదయం ఎండరాగానే తీసివేయాలి. కాయలు ఎండబెట్టే దరిదాపుల్లో కుక్కలు, పిల్లులు, కోళ్లు, ఎలుకలు రాకుండా చూసుకోవాలి.