యాసంగిలో సాగు చేసిన వేరుశనగ ప్రస్తుతం కొన్నిచోట్ల కోత దశలో ఉంది. కాయ లోపలి భాగం ముదురు గోధుమ వర్ణంలోకి మారినప్పుడు కోతకు వచ్చిందని గుర్తించాలి. మొక్కల్లోని 75% కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడే కోయాలి. వానాకాలం నాటికి వేరుశనగ విత్తనం కోసం సాగు చేసిన రైతులు పంటను కోసిన తర్వాత కట్టలు కట్టి నీడలో అరబెట్టాలి. తేమ 8-9% ఉండేలా చూసుకోవాలి. కాయలు ఎండిన తర్వాత గోనె సంచిలో నింపి చెక్కలపై నిల్వ చేయాలి.