సికింద్రాబాద్‌లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐపీఎల్‌లో శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ చేరుకున్న ఆమె హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు జరిపించారు.