మూసీ సుందరీకరణకు తాము అనుకూలమేనని, సుందరీకరణ పేరిట స్థిరాస్తి వ్యాపారానికి తాము వ్యతిరేకమని BRS నేత హరీశ్‌రావు అన్నారు. ‘మూసీ బాధితులకు గచ్చిబౌలి భూముల్లో ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. హైదరాబాద్ నుంచి వాడపల్లి వరకు పాదయాత్ర చేద్దాం. CM రేవంత్ సెక్యూరిటీ లేకుండా పాదయాత్రకు రావాలి. ప్రభుత్వం వచ్చి ఏడాదైనా, 6 మంత్రి పదవులు నింపుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే BRSకు 100 సీట్లు రావడం ఖాయం’ అని చెప్పారు.