తాత్కాలిక ప్రభుత్వంతో పని చేయడానికి సిద్ధం: అమెరికా

85చూసినవారు
తాత్కాలిక ప్రభుత్వంతో పని చేయడానికి సిద్ధం: అమెరికా
బంగ్లాదేశ్‌లో ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మొహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, తాత్కాలిక ప్రభుత్వం శాంతిని, రాజకీయ స్థిరత్వాన్ని స్థాపిస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్