యూపీలోని ప్రయాగరాజ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మీర్జాపూర్ హైవేపై బొలేరోను బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా మృతులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.