వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా లామ్ ఎన్నికయ్యారు. హనోరులో శనివారం ఉదయం జరిగిన వియత్నాం కమ్యూనిస్టు పార్టీ 13వ కేంద్ర కమిటీ సమావేశంలో లామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు వారాల క్రితం మరణించిన పార్టీ ప్రధాన కార్యదర్శి గుయెన్ ఫూ ట్రాంగ్, అంతకముందు తరాల నేతలు సాధించిన విప్లవ విజయాలను పరిరక్షిస్తానని లామ్ ప్రతిన చేశారు.