భారతదేశం నుంచి లైన్ ఆఫ్ క్రెడిట్ సదుపాయం ద్వారా నిధులు సమకూర్చబడిన 28 మాల్దీవుల్లో నీరు, పారిశుద్ధ్య ప్రాజెక్టులను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవులకు అధికారికంగా అప్పగించారు. దీంతో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతానికి ఉజ్వలమైన, మరింత సంపన్నమైన భవిష్యత్తును నిర్మిస్తామని ముయిజ్జు చెప్పారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.