పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో ఇప్పటికే ముగ్గురు చనిపోగా అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత సువేందు కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా.. ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలంటే రాష్ట్రపతి పాలన విధించడం ఉత్తమమని పేర్కొన్నారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేయడం లేదని విమర్శించారు.