స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఫిబ్రవరి 21న వివాహం జరిగిన విషయం తెలిసిందే. గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ లో గ్రాండ్ గా జరిగింది. వీరికి సోషల్ మీడియా వేదికగా ప్రధాని
మోదీ శుభాకాంక్షలు తెలిపారు. “రకుల్, జాకీ.. ఇద్దదు వారి జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రయాణంలో వారి జీవితం ఎంతో సంతోషంగా సాగాలి. అద్భుతమైన జీవితానికి మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.” అంటూ స్పెషల్ నోట్ పంపారు.