అమెరికా చెప్పు చేతల్లోనే ప్రధాని మోదీ పని చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో మోడీ ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని.. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల మృతదేహాలను చూసి కేంద్రం భయపడుతోందన్నారు.