కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ సమయంలో పన్నుల విధానం గురించి విమర్శించారు. నెహ్రూ కాలంలో ఎవరికైనా రూ.20 లక్షల జీతం ఉంటే పావు వంతు పన్ను కట్టాల్సి వచ్చేదని, ఇందిరాగాంధీ సమయంలోనూ ఇదే జరిగిందని పేర్కొన్నారు. నిన్న తాము ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.12 లక్షలు సంపాదించే వారు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా చేశామన్నారు.