ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా పర్యటనలో సోమవారం ఆసక్తికర ఘటన జరిగింది. తన అభిమాని రాంపాల్ కశ్యప్‌ను ప్రధాని మోదీ కలిశారు. ఆయనకు స్వయంగా చెప్పులు తొడిగారు. మోదీకి రాంపాల్ కశ్యప్ వీరాభిమాని. మోదీ ప్రధాని అయ్యే వరకు తాను చెప్పులు వేసుకుని రాంపాల్ కశ్యప్ 14 సంవత్సరాల క్రితం ప్రతిజ్ఞ చేశారు. పార్టీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న మోదీ ఆయనను తన వద్దకు రప్పించుకుని చెప్పులు బహుమతిగా అందజేశారు.