76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం కర్తవ్యపథ్ వద్ద చెత్తను స్వయంగా తీసి స్వచ్ఛభారత్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఈ చర్య ప్లాగింగ్ (పరిగెత్తుతూనే చెత్త తీయడంకు, స్వచ్ఛతకు ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యతను చూపించింది. వేలాది మంది చూస్తుండగా జరిగిన ఈ చర్య ప్రజలందరికీ శుభ్రతపై జాగ్రత్తగా ఉండాలనే సందేశం ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.