ఏపీ, తెలంగాణలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ప్రధాని నరేంద్ర మోదీ ‘X’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో గెలుపొందిన మల్క కొమురయ్య, అంజిరెడ్డికి అభినందనలు చెప్పారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి పని చేస్తున్న తమ కార్యకర్తలను చూసి గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.