టీబీ (క్షయ) నివారణ విషయంలో అద్భుతమైన పురోగతి సాధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. టీబీ రహిత భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని ఆయన వెల్లడించారు. ఇకపై ‘ఉమ్మడి స్ఫూర్తి’తో టీబీ రహిత భారత్ కోసం పోరాడతామని 'ఎక్స్' వేదికగా మోదీ స్పందించారు. కాగా దేశంలో 2015 నుంచి 2023 మధ్య కాలంలో టీబీ వ్యాప్తి రేటు 17.7 శాతం మేర తగ్గిందని జేపీ నడ్డా పేర్కొన్నారు.