నేడు ప్రధాని ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం

81చూసినవారు
'పరీక్ష పే చర్చ' 8వ ఎడిషన్ ఇవాళ నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని మోడీ ఉదయం 11 గంటలకు నేరుగా సంభాషిస్తారు. పరీక్షలను సమర్ధవంతంగా ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం, చిరునవ్వుతో పరీక్షలకు సమాధానాలు రాయడం ద్వారా పరీక్షలంటే భయాన్ని తొలగించేందుకు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీపిక, సద్గురు వంటి అతిథులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

సంబంధిత పోస్ట్