క్లాస్ రూంలో డ్రింక్ చేసిన ప్రిన్సిపల్, మరో టీచర్ (వీడియో)

50చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రెహా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్, మరో టీచర్ తరగతి గదిలో దర్జాగా కూర్చుని మద్యం సేవిస్తున్నారు. అక్కడే ఉన్న కొంతమంది ఈ ఘటనను వీడియో తీశారు. దానిని జిల్లా మేజిస్ట్రేట్‌ ముందు సమర్పించారు. ప్రాథమిక విచారణ అనంతరం మేజిస్ట్రేట్ నిధి గుప్తా వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్