ఉత్తరప్రదేశ్ ఆగ్రా జిల్లాలోని ఓ సెకండరీ స్కూల్‌లో మహిళా ప్రిన్సిపాల్, టీచర్ మధ్య భీకర గొడవ జరిగింది. ఉపాధ్యాయురాలు పాఠశాలకు ఆలస్యంగా రావడంతో ప్రధానోపాధ్యాయురాలు ఆమెను అడ్డుకుని నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాట మాట పెరిగిపోయి తీవ్ర ఘర్షణగా మారింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పాఠశాల యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.