గుజరాత్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడి మధ్య గొడవ చెలరేగగా, ప్రిన్సిపల్.. టీచర్‌పై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భరూచ్‌లోని ఒక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ప్రిన్సిపల్.. టీచర్‌ను చెంపపై పదే పదే కొట్టాడు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.