TG: భూ భారతి చట్టంలో గ్రామ రెవెన్యూ రికార్డుల పేరుతో సెక్షన్ 13, నిబంధన 12ను చేర్చారు. దీని ప్రకారం గ్రామ పహాణీ, ప్రభుత్వ భూములు, నీటి వనరుల భూముల రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తారు. మ్యుటేషన్ జరిగిన ప్రతిసారీ గ్రామ భూలెక్కల్లో మార్పులు జరుగుతాయి. ఏటా డిసెంబరు 31న గ్రామ రెవెన్యూ రికార్డులను ముద్రించి విడిగా భద్రపరుస్తారు.