సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదని పోలీసులు సూచించారు. ప్రొఫైల్‌ను ప్రైవేట్ మోడ్‌లో ఉంచాలని, తెలిసిన వారి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను మాత్రమే అంగీకరించాలని తెలిపారు. అపరిచితుల మెసేజ్‌లను బ్లాక్ చేసి, అవసరమైతే రిస్ట్రిక్ట్ చేయాలని హెచ్చరించారు. ప్రైవసీ సెట్టింగ్స్‌ను తప్పనిసరిగా ఎనేబుల్ చేయాలని తెలిపారు. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే సైబర్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు.