తెలంగాణ గ్రూప్-1 ఫలితాలపై వస్తున్న ఆరోపణలను TGPSC తీవ్రంగా ఖండించింది. కొందరు కావాలనే దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. దీని వెనుక ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఉన్నాయని ఆరోపించింది. లిమిటెడ్ మార్కుల పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సహజం అని, ప్రొటోకాల్ ప్రకారం నిపుణులతోనే వాల్యుయేషన్ జరిగిందని స్పష్టం చేసింది. ఎస్టీ కేటగిరి టాపర్ పైనా దుష్ప్రచారం జరుగుతోందని TGPSC ఫైర్ అయింది.