SS రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ SSMB29లో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుందని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ రామోజీఫిలింసిటీలో కొనసాగుతున్నట్టు ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్‌లో వార్తలు రౌండప్ చేస్తున్నాయి. అయితే, ప్రియాంక షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుందట. ప్రియాంక తన సోదరుడు సిద్దార్థ్ చోప్రా వెడ్డింగ్ కోసం ముంబై వెళ్లిందని సమాచారం.