కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఘన విజయం సాధించారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఆమెకు వయనాడ్ ప్రజలు విజయం కట్టబెట్టారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థి నవ్య హరిదాస్పై 3.82 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంకా బ్రేక్ చేశారు.