దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల నుంచి నేర్చుకుని ముందుకు సాగాలన్నారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఫలితాలు దీనిని ప్రతిబింబిస్తున్నాయని ఆమె అన్నారు. గెలిచిన వారందరికీ అభినందనలు తెలిపారు. మనం అట్టడుగు స్థాయిలో పని చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో నేర్చుకుని భవిష్యత్ వైపు అడుగులు వేయాలన్నారు.