2.26 లక్షల ఓట్లతో ప్రియాంక గాంధీ మెజార్టీ

81చూసినవారు
2.26 లక్షల ఓట్లతో ప్రియాంక గాంధీ మెజార్టీ
కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ 2.26 లక్షల ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి సత్యన్ ముకేరి 77,973 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ (43,352 ఓట్లు) ఉన్నారు. కాగా, తొలిసారి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. గత ఎన్నికల్లో వయనాడ్‌లో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది.

సంబంధిత పోస్ట్