వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ 52 వేల ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక జరిగింది. దీంతో ప్రియాంక గాంధీ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. తొలిసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఉండటం విశేషం.