పశ్చిమబంగాల్‌లోని రాంచీ థామర్ ప్రాంతంలో "దెయ్యాల బారాత్" అనే ప్రత్యేక ఉత్సవం ఆకట్టుకుంది. శివభక్తులు దెయ్యాల వేషధారణతో ఊరేగింపుగా పాల్గొని, భక్తిశ్రద్ధలతో శివుడి అనుగ్రహం కోరారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు తాము ఇలా చేస్తున్నామని చెప్పారు. ఈ వేడుక తరతరాలుగా కొనసాగుతోందని తెలిపారు. చైత్ర పర్వదినాన నిర్వహించే ఈ విశేష ఉత్సవానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.