నోటి క్యాన్సర్ల కారణంగా భారత్‌లో ఉత్పాదకత నష్టం

67చూసినవారు
నోటి క్యాన్సర్ల కారణంగా భారత్‌లో ఉత్పాదకత నష్టం
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్‌లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. ఇది దేశ జీడీపీలో 0.18% అని పేర్కొంది. నోటి క్యాన్సర్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో మూడింట రెండొంతులు భారత్‌లోనే ఉన్నాయని తెలిపింది. 2019 నుంచి 2022 మధ్య 36 నెలల కాలంలో క్యాన్సర్‌ చికిత్స పొందిన 100 మంది రోగులను టీఎంసీ అధ్యయనం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్